IPTV Scams: ఫ్రీ.. మీ కొంప ముంచుతుంది.. ఐపీటీవీ స్కామ్‌లను గుర్తించకపోతే నేరం చేసినట్లే..!
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అబ్బ ఎంత ఆనందమో.. ఇప్పుడు వినోద ప్రపంచంలో ఫ్రీ అనే మాట ఎంత మంచిగా వినిపిస్తుందో.. అంతే దోపిడి జరుగుతోంది.. చట్టవిరుద్ధమైన IPTV సేవలు చౌక స్ట్రీమింగ్‌ను అందించవచ్చు.. కానీ అవి స్కామ్, మాల్వేర్, భద్రతా ప్రమాదాల వంటి ప్రమాదాలతో ముడిపడి ఉంటాయి.. చట్టబద్ధమైన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు కట్టుబడి ఉండటం మీ భద్రతకు ఎందుకు కీలకమో ఇప్పుడు తెలుసుకోండి. IPTV Scam Alert ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అబ్బ ఎంత ఆనందమో.. ఇప్పుడు వినోద ప్రపంచంలో ఫ్రీ అనే మాట ఎంత మంచిగా వినిపిస్తుందో.. అంతే దోపిడి జరుగుతోంది.. వినోదాన్ని అందించే ఓటీటీ (Over-the-top media service) ప్లాట్‌ఫాంలు ఎన్ని ఉన్నా.. ఫ్రీ అనగానే మన మనస్సు అటువైపే లాగుతుంది.. వాస్తవికత, కొత్తదనంతో వృద్ధి చెందే డిజిటల్-కంటెంట్ స్పేస్‌లో ఖచ్చితమంటూ ఏదీ లేదు. అందుకోసమే ఇలాంటి వాటిని ఉపయోగించి అక్రమ ఐపీటీవీ (Internet Protocol television)లు రెచ్చిపోతున్నాయి. దీంతో చాలామంది ఎంటర్టైన్మెంట్ ను ఫ్రీగా దొరుకుతుందని అలాంటి ప్లాట్‌ఫాంలకు వెళ్లి స్కామ్ ల బారిన పడుతున్నారు. డిజిటల్ హక్కులు, మేధో సంపత్తి సూక్ష్మబేధాలను అర్థం చేసుకోకుండా అక్రమ IPT...